![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశాడు. బుధవారం అతని స్వగ్రామం కొలుగూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం. ప్రశాంత్ తో పాటు అతని సోదరుడు మనోహర్ ని కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్ ఫినాలే రోజు ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్ దీప్ అభిమానుల ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో అమర్ దీప్ కారుతో పాటు, పోలీస్ వాహనం, ఆర్టీసీ బస్సుల అద్దాలు పగిలాయి. దీంతో ప్రశాంత్, మనోహర్ తో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
![]() |
![]() |